Hyderabad, ఏప్రిల్ 13 -- Jr NTR Comments In Arjun Son Of Vyjayanthi Trailer Launch Event: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన వేడుక అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ట్రైలర్ లాంచ్ అండ్ మ్యాసీవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న నిర్వహించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బృందానికి అందరికీ కూడా న...