భారతదేశం, ఏప్రిల్ 12 -- అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. వచ్చే వారం ఏప్రిల్ 18వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఏప్రిల్ 12) హైదరాబాద్‍లో జరిగింది. తన అన్న నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ మూవీ ఈవెంట్‍కు హాజరయ్యారు స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఈవెంట్‍లో కొన్ని విషయాలు ఆకట్టుకున్నాయి. అన్నదమ్ముల బాండింగ్ మరోసారి అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా క్లైమాక్స్ చూసి అందరి కళ్లలో నీళ్లు తిరుగుతాయని ఎన్టీఆర్ అన్నారు. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. కాలర్ ఎగరేయాలని ప్రతీసారి తాను చెబుతుంటానని, కానీ అన్నా ఈసారి నువ్వు ఎగరెయ్ అని కల్యాణ్ రామ్‍ను ఎన్టీఆర్ అడిగారు.

కాలర్ ఎగిరేసేందుకు వద్దు అని కల్యాణ్ రామ్ అన...