Hyderabad, ఏప్రిల్ 28 -- Jowar Dosa: జొన్న పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఆధునిక కాలంలో జొన్న పిండితో చేసిన ఆహారాలు తినే వారి సంఖ్య తక్కువగా ఉంది. నిజానికి డయాబెటిస్ బారిన పడినవారు సాధారణ దోశల కంటే జొన్న పిండితో చేసిన దోశలు తినడం చాలా ముఖ్యం. ఈ జొన్న దోశలు క్రిస్పీగా రుచిగా ఉంటాయి. దీన్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ జొన్న దోశలకు వేయడానికి పట్టే సమయం కూడా చాలా తక్కువ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్న దోశలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

జొన్న పిండి - అరకప్పు

జీలకర్ర - అర స్పూను

బియ్యప్పిండి - పావు కప్పు

కరివేపాకులు - గుప్పెడు

పచ్చిమిర్చి - రెండు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - తగినన్ని

1. సాధారణ దోశల్లాగే జొన్న దోశలు క్రిస్పీగా వేసుకోవచ్చు. ...