భారతదేశం, ఫిబ్రవరి 8 -- Joruga Husharuga OTT: బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోగా న‌టించిన జోరుగా హుషారుగా మూవీ ఓటీటీలో రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌న్న‌ర త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. జోరుగా హుషారుగా మూవీ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌మోష‌న్స్ లేకుండా డైరెక్ట్‌గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు.

రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కిన జోరుగా హుషారుగా మూవీకి అను ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో రంగ‌స్థ‌లం ఫేమ్ పూజిత పొన్నాడ హీరోయిన్‌గా న‌టించింది. డిసెంబ‌ర్ 15న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. బేబీ త‌ర్వాత విరాజ్ అశ్విన్ హీరోగా న‌టించిన ఈ చిన్న సినిమా రిలీజ్‌కు ముందు తెలుగు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క‌లిగించింది. కానీ రిజ‌ల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

ల‌వ్ ఫ్...