భారతదేశం, మార్చి 7 -- JNNURM Houses: విజయవాడలో పేదల కోసం నిర్మించిన పదివేల ఇళ్లను ఆరేళ్లుగా లబ్దిదారులకు కేటాయించకుండా వృధాగా వదిలేయడంతో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది. నిర్మాణం పూర్తైన ఇళ్ల సంరక్షణ పట్టించుకోక పోవడంతో అవి అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారాయి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9నెలలు గడిచినా ఇళ్లను పేదలకు కేటాయించక పోవడాన్ని వామపక్షాలు తప్పు పడుతున్నాయి. పేదల కోసం నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం కేటాయించక పోతే పేదలే వాటిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని సీపీఎం హెచ్చరించింది.

పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో జవహర్లాల్ నెహ్రూ (JNNURM) స్కీం క్రింద నిర్మించిన వందలాది ఇళ్ళ సముదాయాన్ని సీపీఎం బృందం సందర్శించింది....