భారతదేశం, ఏప్రిల్ 19 -- Jithender Reddy Mangli Song: బాహుబ‌లి ఫేమ్ రాకేశ్ వ‌ర్రే హీరోగా న‌టిస్తోన్న జితేంద‌ర్‌రెడ్డి నుంచి పెళ్లి సాంగ్‌ను రిలీజ్ చేశారు.తెలంగాణ ప‌దాల‌తో ఫోక్ స్టైల్‌తో హుషారుగా సాగిన ఈ పాట‌ను సింగ‌ర్ మంగ్లీ ఆల‌పించింది. ఈ పాట‌కు గోపీసుంద‌ర్ మ్యూజిక్ అందించ‌గా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు.

ల‌చ్చిమ‌క్క అచ్చెన‌క్క పిల్లాను సూడండే అనే లిరిక్స్‌తో మొద‌లైన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మంగ్లీ వాయిస్ ఈ పాట‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. పెళ్లి తాలుకు స‌ర‌దాలు, సంద‌ళ్ల‌ను ఈ పాట‌లో స‌హ‌జంగా ఆవిష్క‌రించారు.

జితేంద‌ర్‌రెడ్డి మూవీలో వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. చత్రపతి శేఖర్, సుబ్బరాజు, ర‌విప్ర‌కాష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ముదిగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మి...