భారతదేశం, ఫిబ్రవరి 20 -- జియోటెలి ఆపరేటింగ్ సిస్టమ్‌(OS)తో తొలి స్మార్ట్ టీవీ లాంచ్ అయింది. జియోటెలి ఓఎస్‌తో వస్తున్న తొలి స్మార్ట్ టీవీని థామ్సన్ భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో 43 అంగుళాల క్యూఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. టీవీలో జియో అభివృద్ధి చేసిన స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇది స్మార్ట్ టీవీ చూసే అనుభవాన్ని మారుస్తుంది.

జియోటెలి ఓఎస్‌తో కూడిన థామ్సన్ 43 అంగుళాల క్యూఎల్ఈడీ టీవీ 2025 జనవరి 21 నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. రూ.18,999 ధరకు ఈ స్మార్ట్ టీవీ వినియోగదారులకు లభ్యం కానుంది. టీవీపై లభించే ఇతర డిస్కౌంట్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు.

జియోసావన్ 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్, జియోగేమ్స్ 1 నెల ఉచిత సబ్ స్క్రిప్షన్, స్విగ్గీ నుంచి రూ.499 విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ.150 తగ్గింపు లభిస్తుంది.

ఈ టీవీ డీప్ కాంట...