భారతదేశం, మార్చి 6 -- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన వయాకామ్ 18, వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా యూనిట్ల మధ్య కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్‌ జియోస్టార్. ఇందులో 1,100 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ తొలగింపుల ప్రక్రియ నెల రోజుల కిందటే ప్రారంభమైందని, ఇప్పట్లో ముగియవు అని ఓ వ్యక్తి చెప్పారు. ఈ తొలగింపులు జూన్ వరకు కొనసాగుతాయని వెల్లడించారు.

ఉద్యోగాల కోత ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ విభాగాల్లో కార్పొరేట్ పాత్రలను ప్రభావితం చేస్తోందని తెలుస్తోంది. ఈ తొలగింపుల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగులు, సీనియర్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు.

వయాకామ్ 18, డిస్నీ స్టార్ ఇండియా విలీనం భారతదేశపు అతిపెద్ద మీడియా సంస్థను సృష్టించేందుకు ప్రణాళిక అని ...