Hyderabad, ఫిబ్రవరి 14 -- JioHotstar OTT vs Amazon Prime vs Netflix Monthly Plans: అగ్ర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రెండు విలీనం అయి జియో హాట్‌స్టార్ పేరుతో ఒకే ఓటీటీ ఛానల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు ఓటీటీ సంస్థలకు సంబంధించిన కంటెంట్ ఒకే యాప్‌లో చూసేయొచ్చు.

జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లు విలీనం చేస్తూ జియోస్టార్ కొత్త ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌ను శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్రారంభించింది. విలీనమైన జియోస్టార్ ఓటీటీ ఇప్పుడు ఇతర సబ్‌స్క్రిప్షన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలతో పాటు 50 కోట్ల మంది యూజర్లకు జియో హాట్‌స్టార్ అన్ని రకాల కంటెంట్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది.

అంటే, ఇతర ఓటీటీల్లో సబ్‌స్క్రిప్షన్‌తో చూసే కంటెంట...