భారతదేశం, ఏప్రిల్ 4 -- JioHotstar IPL offer: ఐపీఎల్ 2025 భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మొబైల్స్ లో కూడా లైవ్ మ్యాచ్ లను కోట్ల సంఖ్యలో అభిమానులు వీక్షిస్తున్నారు. దాంతో, రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు తన పాపులర్ ఆఫర్ ను పొడిగించాలని నిర్ణయించింది. వాస్తవానికి జియో 90 రోజుల కాంప్లిమెంటరీ జియో హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే, జియో ఆ గడువును పొడిగించింది. వినియోగదారులు ఇప్పుడు ఏప్రిల్ 15 వరకు ఈ ఆఫర్ సేవలను పొందవచ్చు. మునుపటి కటాఫ్ మిస్ అయిన యూజర్ల డిమాండ్ కు ప్రతిస్పందనగా ఈ పొడిగింపు వచ్చింది.

రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన అన్ని జియో ప్రీపెయిడ్ ప్లాన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారులు తమ ప్లాన...