భారతదేశం, ఏప్రిల్ 22 -- JioCinema OTT: జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అధిక శాతం కంటెంట్ ఉచితంగానే అందుబాటులో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‍లను కూడా ఉచితంగా స్ట్రీమింగ్‍కు ఉంచింది ఆ ప్లాట్‍ఫామ్. కొన్ని హాలీవుడ్ సినిమాలు తప్ప దాదాపు జియోసినిమాలో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్‍లు, టీవీ కంటెంట్ ఉచితంగానే చూడొచ్చు. అయితే, ఈ క్రమంలో ఓ కొత్త సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍ను ప్రవేశపెట్టేందుకు జియో సినిమా సిద్ధమైంది. ఇది యాడ్ ఫ్రీ ప్లాన్‍గా ఉండనుంది. ఆ వివరాలివే..

ఏప్రిల్ 25వ తేదీన కొత్త ప్లాన్‍ను తీసుకురానున్నట్టు జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. ఈ విషయంపై అధికారికంగా ప్రోమో తీసుకొచ్చింది. యాడ్లు లేకుండా కంటెంట్ చూసేలా ఈ ప్లాన్ ఉండనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సాగుతున్న తరుణంలో ఈ ప్లాన్‍ను ప్రవేశపెడుతోంది.

జియోసినిమ...