భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్ చూడాలనుకునే వారికి రిలయన్స్ జియో రెండు ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్లు అందిస్తుంది. వీటి ద్వారా మీరు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్లను రూ.175, రూ.445 ధరలలో లభిస్తాయి. ఈ రెండు ప్లాన్లలోనూ మీకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందుతుంది. అంతేకాకుండా డేటా, కాల్స్ కూడా లభిస్తాయి. వీటి వివరాలు తెలుసుకుందాం..

జియో ఇది చౌకైన ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్. ఈ ప్లాన్‌లో దాదాపు 10 ఉచిత ఓటీటీ యాప్ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. రూ.175 లో మీకు సోనీ లివ్, జీ5, జియోసినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, Kanchha Lannka, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, HoiChoi, జియో టీవీ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి.

అలాగే ఈ ప్లాన్‌లో మొత్తం 10జీబీ డేటా దొరుకుతుంది. ఇది రో...