Hyderabad, మార్చి 7 -- దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోనూ తన హవా చూపిస్తోన్న సంగతి తెలిసిందే. అందంతో పాటు యాక్టింగ్‌లోనూ అదరగొట్టేసే ఈ అమ్మడు ఫిట్‌నెస్ విషయంలోనూ ఏమాత్రం తగ్గకుండా కనిపిస్తుంది. సినిమాలు, యాడ్‌లు, సెలబ్రిటీ ఈవెంట్లలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తరచూ తన వర్కవుట్ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. మార్చి 6తన పుట్టిన రోజు సందర్భంగా 28 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పటికీ ఇంత ఫిట్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించడం వెనకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం.

2022లో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్పైతో మాట్లాడుతూ జాన్వి ఆమె పూర్తిగా ఇంట్లో తయారుచేసిన ఆహారాలపైనే దృష్టి పెడుతుందని, అప్పుడప్పుడు మాత్రమే ఆమెకు నచ్చినవి తింటుందని చె...