భారతదేశం, ఏప్రిల్ 25 -- జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో 56 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ అధికారిక వెబ్సైట్ jeemain.nta.ac.in లో తమ స్కోర్లను చెక్ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో టాపర్ల జాబితాను కూడా ఎన్టీఏ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చింటూ సతీష్ కుమార్, దాద్రా నగర్ హవేలీకి చెందిన దత్తరాజ్ బాలకృష్ణ సౌదాగర్, ఢిల్లీకి చెందిన తనయ్ ఝా, గుజరాత్ కు చెందిన పరేఖ్ మీట్ విక్రమ్ భాయ్, జమ్ముకశ్మీర్ కు చెందిన సుశాంత్ పడా జేఈఈ మెయిన్ 2024లో టాపర్లుగా నిలిచారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులు ఉన్నారు. వారు కర్ణాటకకు చెందిన సాన్వి జైన్, ఢిల్లీకి చెందిన షైనా సిన్హా.

100 స్కోర్ సాధించిన విద్యార్థుల సంఖ...