భారతదేశం, ఫిబ్రవరి 14 -- JEE Main 2025 : జేఈఈ మెయిన్ 2025 ఫలితాలలో తమ విద్యార్థులు సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1లో అద్భుతమైన పనితీరుతో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నామని నారాయణ యాజమాన్యం ప్రకటించింది.

'బణీ బ్రాతా మాజీ...300/300 మార్కులు సాధించి , 100 పర్సంటైల్ సాధించారు. ఇది అతని అంకితభావానికి, నారాయణ విద్యా విధానానికి ఒక అద్భుతమైన నిదర్శనం. అతనితో పాటు, ఆయుష్ సింఘాల్ , కుషాగ్ర గుప్తా, విశాద్ జైన్, శివన్ వికాస్ తోష్నివాల్ కూడా 100 పర్సంటైల్‌లను సాధించారు. వీరంతా నారాయణ వారసత్వాన్ని మరింత బలోపేతం చేశారు.

ఈ అసాధారణ విజయానికి తోడు, నారాయణ విద్యార్థులు పలు రాష్ట్రాలలో టాపర్ల జాబితాలో ఆధిపత్యం చెలాయించారు. ఆయుష్ సింఘాల్ రాజస్థాన్ రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. కుశాగ్ర గుప్తా కర్నాటకలో అగ్రస్థానంలో...