Hyderabad, ఫిబ్రవరి 27 -- JD Chakravarthy About Raa Raja Movie Poster: శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం 'రా రాజా'. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు.

ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది 'రా రాజా' మూవీ టీమ్. రా రాజా మూవీకి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన రా రాజా మూవీని మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనికి సంబంధించి రా రాజా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను వెర్సటైల్ యాక్టర్, హీరో జేడీ చక్రవర్తి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విశే...