భారతదేశం, జనవరి 5 -- JC Prabhakar Reddy : బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవీలత గురించి ఆవేశంలో, వయసు ప్రభావంతో అలా మాట్లాడానని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. వయసు ప్రభావం ఆవేశంలో తప్పుగా మాట్లాడానన్నారు. నాయకులు అంటే ప్రజల్లో తిరిగితేనే గుర్తింపు వస్తుందని, ఫ్లెక్సీలతో కాదన్నారు. జగన్ పార్టీలో చేరాలని విమర్శలు చేసిన బీజేపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొందరు తనను పార్టీ మారండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని, కేవలం చంద్రబాబు కోసం మాత్రమే టీడీపీ ఉన్నానన్నారు. తానేంటో తాడిపత్రి ప్రజలకు బాగా తెలుసు.. అందరికీ తెలియాల్సి అవసరం లేదన్నారు.

డిసెంబరు 31న తాడిపత్రి జేసీ పార్క్ లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకలపై మాధవీలతతోపాటు, బీజేపీ నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్...