భారతదేశం, ఏప్రిల్ 16 -- Jayashankar Dt Crime: అక్క ప్రేమ వివాహానికి సహకరించాడనే అనుమానంతో ఇసుక క్వారీలో పని చేస్తున్న ఓ వ్యక్తిని యువతి తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో నరికి ప్రాణాలు తీశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపగా.. ఈ కేసులో యువతి తమ్ముడిని దోషిగా తేలుస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణ హత్యకు పాల్పడిన యువకుడికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా సీతానాగారం గ్రామానికి చెందిన సంగిశెట్టి కిశోర్(22) భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీలో సూపర్ వైజర్ గా పని చేసేవాడు.

తన స్నేహితుడు విజయనగరం జిల్లాకు చెందిన చోడవరపు ...