భారతదేశం, ఫిబ్రవరి 24 -- Jayashankar Bhupalpally Crime : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలి మెడలోని బంగారం కోసం గుర్తు తెలియని దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న అనంతరం వృద్ధురాలి చేతులు కట్టేసి, గోనె సంచిలో కుక్కి బావిలో పడేసి హత్య చేశారు. జిల్లాలోని టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి శివారు బోయినపల్లిలో ఈ దారుణ ఘటన జరగగా.. సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సొరపాక వీరమ్మ(70)కు నలుగురు కొడుకులు సంతానం కాగా.. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వీరమ్మ వేరుగా ఉంటోంది. కాగా ఉపాధి కోసం గ్రామంలోని చింత చెట్ల వద్ద చింతకాయలు ఏరుకుని, ఆ చింతపండును సమీపంలోని గర్మిళ్లపల్లిలో అమ్ముకునేది.

చింతపండు అమ్ముకుంటూ జీవనం సాగిస్తు...