భారతదేశం, ఫిబ్రవరి 22 -- గణపురం మండలం గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్‌కు.. నగరంపల్లికి చెందిన లాస్యతో కొంతకాలం కిందట వివాహం జరిగింది. ఆ తరువాత లాస్య గర్భం దాల్చగా.. దాదాపు నాలుగు నెలల కిందట రెండో సంతానంలో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అందులో పాప, బాబు ఉండగా.. చిన్నారులిద్దరినీ ప్రాణంగా చూసుకుంటున్నారు. కవల పిల్లలు కావడం, తల్లి పాలు సరిపడా లేకపోవడంతో కొద్ది రోజులుగా చిన్నారులద్దరికీ డబ్బా పాలు పడుతున్నారు.

డెలవరీ అనంతరం నుంచి లాస్య తన తల్లిగారి గ్రామమైన నగరంపల్లిలో ఉంటుండగా.. రోజువారీలాగే లాస్య తన ఇద్దరు పిల్లలకు శనివారం డబ్బా పాలు పట్టింది. ఉదయం 8 గంటలకు ఒకసారి, 10 గంటలకు మరోసారి తాగించి పిల్లలను పడుకోబెట్టింది. అయితే 12 గంటల సమయంలో పిల్లల్లో కదిలికపోవడంతో అనుమానం వచ్చి చూడగా.. పిల్లల ముక్కుల్లోంచి పాలు కారుతూ కనిపించింది. దీంతో తల్లి లాస...