భారతదేశం, జనవరి 29 -- ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు. ఈ సంవత్సరము జయ ఏకాదశి జనవరి 29, అనగా ఈరోజు వచ్చింది. దీనిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. భూమి ఏకాదశి అని కూడా పేరు ఉంది. పైగా ఈ విశేషమైన రోజున రవి యోగం కూడా ఏర్పడబోతోంది. ఇది మరింత శుభప్రదమైనది.

ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. ఇక ఈ విశేషమైన జయ ఏకాదశి నాడు విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే చాలా మంది వారి రాశి ప్రకారం పరిహారాలను పాటిస్తూ ఉంటారు. మరి ఈ జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి వేళ ఏ రాశి వారు వేటిని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మేష రాశి వారు ఈ విశేషమైన జయ ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించండి. పసుపు, చందనం, బెల్లాన్ని సమర్పిస్తే మంచిది.

వృషభ రాశి వారు అన్నింటా జయలే కల...