భారతదేశం, ఫిబ్రవరి 22 -- Jawa 350 Legacy Edition: ఇండియన్ మార్కెట్లో జావా 350 అడుగుపెట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా క్లాసిక్ లెజెండ్స్ ఇండియన్ మార్కెట్లో జావా 350 లెగసి ఎడిషన్‌ను ప్రారంభించింది. దీని ప్రారంభ ధర రూ. 1.98 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్). దీనిని లిమిటెడ్ ఎడిషన్ గా తీసుకువస్తున్నందున, ఇది మొదటి 500 కస్టమర్లకు మాత్రమే పరిమితం.

జావా 350 లెగసి ఎడిషన్ లో ప్రత్యేకంగా ఒక టూరింగ్ వైజర్ ఉంటుంది. పిలియన్‌ రైడర్ కు సపోర్ట్ కోసం, అలాగే సౌకర్యాన్ని అందించడం కోసం ఒక బ్యాక్‌రెస్ట్ ఉంటుంది. బైక్ పడిపోయిన సమయంలో లేదా ప్రమాదాల సమయంలో మోటార్ సైకిల్ ఇంజిన్‌ను రక్షించడానికి ఒక క్రాష్ గార్డ్‌తో వస్తుంది. జావా ఒక లెదర్ కీచైన్ మరియు కలెక్టర్ ఎడిషన్ జావా 350 యొక్క చిన్న నమూనాను కూడా అందిస్తుంది.

జావా 350 అప్‌డేట్ చేయబడిన పవర్‌ట్రైన్ తో వస్తుంది. 29...