Hyderabad, జనవరి 27 -- Sudheer Babu Jatadhara Zee Studio Prerana Arora: టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుధీర్ బాబు. ఇటీవల నవ దళపతిగా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు ఇంతకుముందు హరోం హర, మా నాన్న సూపర్ హీరో వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్నాయి.

కానీ, గుర్తుండిపోయేంతగా హిట్ కొట్టలేదు. దీంతో మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు సుధీర్ బాబు. ఈ నేపథ్యంలో నవ దళపతి సుధీర్ బాబు నుంచి వస్తున్న కొత్త సినిమా జటాధర. సూపర్ నాచురల్ హారర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్‌ జోనర్‌లో జటాధర తెరకెక్కుతోంది. ఈ జటాధర చిత్రాన్నిప్రేరణ అరోరాతో కలిసి నిర్మించేందుకు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది.

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ రుస్తుం మూవీ తరువాత మళ్లీ ప...