భారతదేశం, జనవరి 1 -- జనవరి 1, 2026 గురువారం అనగా నేడు ఆంగ్ల సంవత్సరం మొదలు అయ్యింది. 2026 జనవరి నెల క్యాలెండర్, పండుగలు, సెలవులు, రాశిఫలాలు, మరియు 2026 సంవత్సరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఈ కథనంలో అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు కూడా జరుగుతాయి.

2026 జనవరి 1వ తేదీ గురువారం నాడు నూతన సంవత్సరం మొదలు అయ్యింది. 2025 సంవత్సరంలో ఉన్నట్లే, కొత్త సంవత్సరం 2026 లో కూడా పండుగల తేదీల విషయంలో కాస్త గందరగోళం ఉంది. ముఖ్యంగా హోళీ మరియు దీపావళి పండుగల తేదీలపై కాస్త కన్ఫ్యూజన్ వుంది.

హోలీ పండుగ రోజున గ్రహణం ఉంది. సాధారణంగా హోలికి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. గ్రహణం వలన హోలికా దహనం ఏ రోజున చేయాలి అనే విషయంలో సందేహం వస్తుంది. అయితే, రంగులు చల్లుకుని హోళీ జరుపుకునే రోజు మార్చి 4గా నిర్ణయించబడింది. గ్రహణాలు, తిథుల మార్ప...