భారతదేశం, ఫిబ్రవరి 15 -- ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినర్ పై మూడు నెలల నిషేధం పడింది. 2024లో రెండు సార్లు డోపింగ్ పరీక్షలో సినర్ పాజిటివ్ గా తేలాడు. కానీ మొదట తాను ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని బ్యాన్ విధించకుండా వదిలేశారు. దీనిపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇటలీ టెన్నిస్ ఆటగాడు యానిక్ సినర్ మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఈ డోపింగ్ బ్యాన్ ఫిబ్రవరి 9 నుంచి మే 4 వరకు కొనసాగుతోంది. ''దాదాపు ఏడాదిగా ఈ కేసు నా మీద వేలాడుతూనే ఉంది. ప్రాసెస్ చాలా కాలం సాగుతుంది. నా టీమ్ చేసిన దానికి నేనే బాధ్యుణ్ని. అందుకే 3 నెలల నిషేధం విధిస్తూ ప్రపంచ డోపింగ్ నిరోధకం సంస్థ (వాడా) ఇచ్చిన ఆఫర్ ను అంగీకరించా'' అని సినర్ పేర్కొన్నాడు.

గతేడాది ఆరంభంలో సినర్ ఫిజియోథెరపిస్ట్ వేలు కట్ అయింది. దానికి అతను క్లోస్టెబాల్ ఉన్న స్ప్రే వాడాడు. ...