భారతదేశం, జనవరి 29 -- జానీ మాస్ట‌ర్ కేసు మ‌రోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జానీ మాస్ట‌ర్ పిటీష‌న్‌ను కోర్టు కొట్టివేసింద‌ని ఇదొక గొప్ప తీర్పు అంటూ న‌టి, యాంక‌ర్ ఝాన్సీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఝాన్సీ పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టింది. ఝాన్సీ పోస్ట్‌పై జానీ మాస్ట‌ర్ కూడా రియాక్ట్ అయ్యాడు. త‌మ సొంత లాభం కోసం కొంద‌రు కోర్టు ఆర్డ‌ర్లు మార్చేసి త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నారంటూ ఓ ట్వీట్ చేశాడు.

ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ కొరియోగ్రాఫ‌ర్ జానీ కేసు వేశారు. ఈ కేసులో ఫిల్మ్ ఛాంబ‌ర్ గెలిచింది. జానీ భాషా పిటీష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. ప‌ని చేసే చోట మ‌హిళ‌ల‌ భ‌ద్ర‌తకు ప్రాధాన్య‌త‌ ఉంటుంద‌ని ఈ తీర్పు ద్వారా మ‌రోసారి రుజువైంది అని ఝాన్సీ ఈ పోస్ట్‌లో పేర్కొన్న‌ది. ధ‌ర్మం వైపు నిల‌బ‌డి న్యాయ‌పోరాటం చేసేందు...