Hyderabad, ఏప్రిల్ 20 -- Janhvi Kapoor About Period Pain: అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన పెద్ది మూవీలో కథానాయికగా చేస్తోంది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కూడా సినిమాలతో బిజీగా ఉంది.

అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పీరియడ్స్ పెయిన్ గురించి జాన్వీ కపూర్ మాట్లాడింది. పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పి ఓ పీడకలలాగే ఉంటుందన్న జాన్వీ కపూర్ అవే పీరియడ్స్ మగాళ్లకు వస్తే న్యూక్లియర్ వార్ జరుగుతుందేమో అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అమ్మాయిల పీరియడ్స్ పెయిన్ గురించి చులకనగా, వెటకారంగా మాట్లాడే వారికి కౌంటర్ ఇస్తూ ఇలాంటి కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్.

"పీరియడ్స్ గురించి, ఆ సమయంలో వచ్చే నొప్పి, మూడ్ స్వింగ్స్ గురించి నేను వాదిస్తున్నాను అని అనుకోవచ్చు. కానీ, నా వరకు ఇద...