Hyderabad, జనవరి 29 -- Janhvi Kapoor Condom Ad: జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లోని టాప్ నటీమణుల్లో ఒకరు. తన పర్ఫెక్ట్ ఫిగర్ తో ఆమె ఆకట్టుకుంటోంది. అయితే ఆమె సినిమాలకే కాదు.. తన కండోమ్ యాడ్ కు కూడా బాగా సూటవుతుందని అంటున్నారు మ్యాన్‌కైండ్ ఫార్మా్ ఫౌండర్ రాజీవ్ జునేజా. రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన ఆయన.. మేల్ యాక్టర్స్ లో అయితే రణ్‌బీర్ కపూర్ అని చెప్పడం విశేషం.

ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ నుంచి వచ్చే కండోమ్స్ మ్యాన్‌ఫోర్స్ కు రెండేళ్ల కిందట బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకూ సన్నీ లియోనీ ఉండగా.. ఆమెను పక్కన పెట్టి ఈ యువ నటుడిని తీసుకున్నారు. దీని వెనుక కారణమేంటో మ్యాన్‌కైండ్ ఫార్మా ఫౌండర్ రాజీవ్ జునేజా తాజాగా వివరించారు.

రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన ఆయన...