భారతదేశం, ఏప్రిల్ 12 -- జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామ శివారులోని గిర్ని తండా సమీపంలో ఇటుక బట్టీ పనులు నడుస్తున్నాయి. ఇటుకల తయారీ కోసం బోడోనికుంట నుంచి గిర్నితండాకు ట్రాక్టర్‌తో రేగడి మట్టి చేరవేస్తున్నారు. మొండ్రాయి గ్రామానికి చెందిన విఘ్నేష్(18) అనే యువకుడు లోడింగ్ లిస్ట్ రాస్తున్నాడు. ఒక్కో ట్రాక్టర్, ఎన్ని ట్రిప్పులు వస్తోందో లెక్కలు వేస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం ఉదయం ఓ ట్రాక్టర్ మట్టిని అన్ లోడ్ చేసేందుకు ఇటుక బట్టీ ప్రదేశానికి వచ్చింది. విఘ్నేష్ దాని వద్దకు వెళ్లాడు. వివరాలు రాసుకుంటున్న క్రమంలో.. ట్రాక్టర్ డ్రైవర్ మట్టిని లోడ్ చేసేందుకు డబ్బా జాకీ లేపాడు. డబ్బా పైకి లేచిన అనంతరం ఒకవైపు ఒరిగి అక్కడే ఉన్న విఘ్నేష్ తలపై పడింది. దీంతో విఘ్నేష్ అక్కడే కుప్పకూలిపోయాడు. అతని తలపై ట్రాక్టర్ డబ్బా పడటంతో తల మొత్తం నుజ్జు...