భారతదేశం, ఫిబ్రవరి 16 -- Jangaon Accident : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఆదివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ఓ లారీ అతి వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులోని పది మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. బస్సును ఢీకొన్న అనంతరం లారీ అక్కడున్న షాపుల్లోకి దూసుకెళ్లింది. అదృష్టావశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మిర్యాలగూడ నుంచి సిమెంట్ బస్తాల లోడ్ తో వెళ్తున్న ఓ లారీ ఆదివారం ఉదయం పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాకు చేరుకుంది. కాగా తొర్రూరు వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు జనగామ వెళ్లేందుకు రాజీవ్ చౌరస్తా దాటుతుండగా..అటుగా వస్తు్న్న లారీ కంట్రోల్ తప్పింది. దీంతో లారీ ఆర్టీసీ బస్సును వేగంగా...