భారతదేశం, ఫిబ్రవరి 20 -- Janasena Nadendla: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ PawanKalyanపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ ఘాటు స్పందించింది. కేసులకు తాము భయపడేది లేదని జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏ మాత్రం చట్టబద్దత లేని వాలంటీర్ వ్యవస్థతో ఐదేళ్లలో వందలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,02,836 మంది వాలంటీర్లVoluenteers డేటా నమోదు కాలేదని... వాళ్ల పేరుతో ఏటా రూ.617 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయాల చట్టంలో ఎక్కడా వాలంటీర్ అనే పేరు ఉండదని, వాలంటీరు వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడంలోనూ జగనన్న మోసం చేశాడని నాదెండ్ల మండిపడ్డారు.

వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రైవేటు ఏజెన్సీPvtAgencyకు అనుచిత లబ్ధి చేకూర్చారని, ఈ వ్యవమారంలో తామే న్యాయస్థానాల్లో నిరూపిస్తామన్నారు...