భారతదేశం, ఫిబ్రవరి 9 -- Janasena Kiran Royal : తిరుప‌తి జ‌న‌సేన ఇన్ ఛార్జ్ కిర‌ణ్ రాయ‌ల్‌పై వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతూ వైర‌ల్ అవుతుంది. త‌న‌ను బెదిరించి, మోసం చేసి రూ.కోటికి పైగా న‌గ‌దు, బంగారం కిర‌ణ్ రాయ‌ల్‌ కాజేశాడ‌ని, అందుకే తాను ఆత్మహ‌త్య చేసుకుంటాన‌ని మ‌హిళ వీడియో విడుద‌ల చేసింది. అనంత‌రం ఆ మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉన్న వీడియో విడుద‌ల అయింది. అలాగే ఆ మ‌హిళ‌కు కిర‌ణ్ రాయ‌ల్‌ ఫోన్ చేసి బెదిరించిన ఆడియో క్లిప్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఈ రెండు వీడియోలు, ఆడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతుంది. అయితే త‌న‌పై వైసీపీ దుష్ప్రాచారం చేస్తోంద‌ని కిర‌ణ్ రాయ‌ల్ ఖండించారు.

కిరణ్ రాయల్‌ను న‌మ్మి మోసం పోయాన‌ని తిరుప‌తికి బైరాగ‌ప‌ట్టడుగుకు చెందిన ఓ మ‌హిళ వీడియోలో పేర్కొంది. అప్పులు చేసి ప‌లుసార్లు రూ.1.20 కోట్ల వరకు కిరణ్ ...