ఆంధ్రప్రదేశ్,చిత్రాడ, మార్చి 14 -- జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకత్వం 'జయకేతనం' పేరుతో భారీ సభను తలపెట్టింది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం పరిధిలోని చిత్రాడలో తలపెట్టిన ఈ సభకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణమంతా జనసంద్రగా మారిపోయింది. సభను ఉద్దేశించి. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.

సభలో ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ప్రసంగించారు. అధికారం ఉందనే అహంకారంతో మాట్లాడవద్దని పిలుపునిచ్చారు. తలకెక్కి మాట్లాడిన వారి పరిస్థితి ఏంటో చూస్తున్నామన్నారు. అధికారం ఉందనే అహంకారంతో కాదు, బాధ్యతగా మాట్లాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆచితూచీ వ్యవహరించాలన్నారు.

"పవన్ కల్యాణ్‌ చాలా గొప్ప వ్యక్తి. అతను చాలా ఎత్తుకు ఎదిగాడు. వీలైతే పవన్ కల్యాణ్‌ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి. లేదంటే అంత గొప...