ఆంధ్రప్రదేశ్,పిఠాపురం, మార్చి 14 -- పిఠాపురంలో చిత్రాడ వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు జనసైనికులు భారీగా హాజరయ్యారు. దీంతో చిత్రాడ అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దాశరథి కృష్ణమాచార్యులు, కొండగట్టు అంజన్నతో పాటు ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేర్లను ప్రస్తావిస్తూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

"ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటుని కూడా తాకలేవ్ అని ఛాలెంజ్ చేసి కొట్టిన తొడలని విరిచాం. దేశమంతా తల తిప్పి చూసేలా వందశాతం విజయంతో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమిని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగరేస్తున్నాం" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

"ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోయే స్థితిలో ఉన్న నాకు కొండగట్టు అంజన్న దయ, ...