భారతదేశం, మార్చి 14 -- ఆవిర్భావం, పోరాటం నుంచి అధికారం వరకు.. జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. 2014లో పురుడు పోసుకున్న జనసేన.. ఇవాళ ఘనంగా 12వ ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం ప్రజల సంక్షమంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు.

250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభా ప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. సభకు 1,700 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు.

జనసేన సభ కారణంగా పిఠాపురంలో పోలీసుల...