భారతదేశం, జనవరి 21 -- Janasena : జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి ఈసీ గుర్తింపు లభించింది. దీంతో గాజు గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. దీంతో ఈసీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు చోటు దక్కింది. ఇప్పటి వరకూ రిజిస్టర్డ్ పార్టీగానే జనసేనకు గుర్తింపు ఉంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రిజిస్టర్డ్ పార్టీ హోదాలోనే జనసేన పోటీ చేసింది.

జనసేన అభ్యర్థన మేరకు ఎన్నికల సమయంలో గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే గాజు గ్లాస్ సింబల్ జనసేనకు కేటాయించారు, మిగిలిన నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టిన విషయం తెలిందే. అయితే తాజాగా జనసేనకు ఈసీ గుర్తింపు రావడంతో ఇకపై గాజు గ్లాస...