భారతదేశం, జనవరి 27 -- Janagama News: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల ఘర్షణతో జనగామలో మంత్రి పొంగులేటి హాజరు కావాల్సిన సభ రద్దయ్యింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మినిస్టర్, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కావాల్సి ఉంది.

మంత్రి పర్యటన సందర్భంగా జనగామ జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా పోలీసులు కొంతమంది బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాగా ముందుగా హనుమకొండ జిల్లాలోని పెంబర్తి, క్యాతంపల్లిలో సభలు ముగించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎర్రగుంట తండాకు బయలు దేరారు.

అదే సమయంలో అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను విడిచి పెట్టాలంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర...