భారతదేశం, మార్చి 12 -- Janagama Kidnap: జనగామలో 10 నెలల చిన్నారిని కిడ్నాప్‌ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్ నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఏసీపీ పండరి చేతన్ నితిన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తిస్‌గడ్ రాష్ట్రానికి చెందిన రామ్ జుల్ రజాక్ - పార్వతి దంపతులు. అక్కడ ఉపాధి దొరకపోవడంతో కొద్ది రోజుల కిందట భార్యాభర్తలు తమ నలుగురు పిల్లలతో కలిసి జనగామ పట్టణానికి వచ్చారు. అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ వద్ద కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

రామ్ జుల్ రజాక్, పార్వతీ దంపతులు పని చేస్తున్న చోటుకు స్వామిరాజ్, విజయ లక్ష్మి అనే దంపతులు వచ్చారు. వారి వద్దే...