Hyderabad, మార్చి 24 -- Jana Nayagan Release Date: దళపతి విజయ్ చివరి మూవీ జన నాయగన్ ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. గతంలో ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా రానుందని చెప్పినా.. ఇప్పుడు రిలీజ్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జనవరి 9, 2026న రిలీజ్ కాబోతోందని మేకర్స్ సోమవారం (మార్చి 24) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచాడు. తన చివరి సినిమా జన నాయగన్ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలోనే మూవీ టైటిల్ రివీల్ చేశారు. విజయ్ చివరి మూవీ కావడంతో దీనికి ఎక్కడ లేని క్రేజ్ నెలకొంది.

ఈ సినిమా తర్వాత అతడు పూర్తిస్థాయిలో తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది జరి...