Hyderabad, ఏప్రిల్ 1 -- Jana Nayagan OTT: జన నాయగన్.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినిమా కెరీర్లో నటిస్తున్న చివరి మూవీ. ఆ తర్వాత అతడు పూర్తిగా రాజకీయాలకే అంకితం కానున్నాడు. దీంతో ఈ జన నాయగన్ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ నెలకొంది. ఆ క్రేజే ఇప్పుడీ మూవీ ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి అమ్ముడయ్యేలా చేసింది.

జన నాయగన్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. జన నాయగన్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీనికోసం ఆ ఓటీటీ ఏకంగా రూ.121 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

దళపతి విజయ్ చివరి సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర కూడా రికార్డులను తిరగ రాస్తుందని భావిస్తున్న ఈ మూవీ డిజిటల్ హక్కులకు ఈ మాత్రం కామనే అని అతని ఫ్యాన్స్ అంటున్నారు. హెచ్ వినోద్ ఈ మూవ...