Hyderabad, జనవరి 26 -- Thalapathy Vijay 69 Movie Jana Nayagan Title Revealed: ఇళయ దళపతి విజయ్ 69 మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇదే విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కానుందని ఇదివకు దళపతి ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టనున్న నేపథ్యంలో విజయ్ చివరి సినిమా బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ 69 మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. విజయ్ ఆఖరి సినిమా టైటిల్‌ను జన నాయగన్‌గా ఖరారు చేశారు. దీనికి సంబంధించిన జన నాయగన్ టైటిల్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ (జనవరి 26) విడుదల చేశారు.

జన నాయగన్ సినిమాలోని విజయ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో హీరో విజయ్ నీలిరంగు డెనిమ్ షర్ట్, బ్లాక్ ప్యాంటు, బూట్లు ధరించాడు. అలాగే డార...