భారతదేశం, ఏప్రిల్ 4 -- యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. వచ్చే సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్లో గోవాకు ఆడబోతున్నాడు. ముంబయి టీమ్ ను వీడేందుకు అతను నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) కోరడం కలకలం రేపింది. మంచి పీక్ స్టేజ్ లో ముంబయి లాంటి టాప్ టీమ్ ను యశస్వి ఎందుకు వదిలి వెళ్తున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. అయితే ముంబయి కెప్టెన్ రహానె, కోచ్ ఓంకార్ సాల్వితో జైస్వాల్ కు పడలేదని తెలిసింది. వీళ్లతో ఆర్గ్యుమెంట్ తర్వాత రహానె కిట్ బ్యాగ్ ను జైస్వాల్ కోపంలో తన్నాడని సమాచారం.

ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం.. జైస్వాల్, ముంబయి కెప్టెన్ రహానె మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. జైస్వాల్, రహానె మధ్య అంతా సజావుగా లేదు. ఆ రిపోర్ట్ ప్రకారం గత సీజన్ లో ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్ తర్వాత జైస్వాల్.. ముంబయి కెప్టెన్ రహానె కిట్ బ్యాగ్‌ను...