భారతదేశం, మార్చి 8 -- Jagtial Tragedy : పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ప్రాణాలు వదిలాడు. బాజాభజంత్రీలు మ్రోగాల్సిన ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. మరికొద్ది గంటల్లో పెళ్లి ముహూర్తం ఉండగా వరుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కారణం స్పష్టంగా తెలియకపోయినా, వరుడు ఆత్మహత్య కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచింది. జగిత్యాల జిల్లా వెల్లుల్లలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది.‌

మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్ కు అదే గ్రామానికి చెందిన యువతితో వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఈనెల 9న ఆదివారం ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. అబ్బాయి అమ్మాయి ఫొటో షూట్ కూడా చేసుకున్నారు. పెళ్లికి ఆహ్వానిస్తూ శుభలేఖలు పంచడంతో బంధుమిత్రులు వరుడు ఇంటికి చేరుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్క...