భారతదేశం, ఫిబ్రవరి 16 -- Jagtial News : క్షణికావేశం తల్లితో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది. భర్తపై కోపంతో పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య చేసుకుంది. తల్లి రెండు రోజుల క్రితం మృతి చెందగా ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఆదివారం ప్రాణాలు వదిలారు. ముగ్గురు మృతితో జగిత్యాల జిల్లా మద్దులపల్లిలో విషాదం నెలకొంది.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. కంబాల హారిక భర్త తిరుపతిపై కోపంతో తొమ్మిదేళ్ళ కొడుకు కృష్ణాంత్, 8 ఏళ్ళ కూతురు మాయంతలక్ష్మికి ఈనెల 14న సాయంత్రం గడ్డి మందు తాగించి తాను తాగి ఆత్మహత్య చేసుకుంది. హారిక 14న రాత్రి జగిత్యాల ఆసుపత్రిలో మృతి చెందగా ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా హైదరాబాద్ కు తరలించారు. ఇద్దరు చిన్...