తెలంగాణ,జగిత్యాల, ఏప్రిల్ 5 -- జగిత్యాల జిల్లా కల్లెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయుడు కె.గంగారెడ్డి వ్యవహార శైలి వివాదస్పదంగా మారింది. పాఠశాలలో విద్యార్ధినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు ప్రైవేట్ భాగాలను టచ్ చేస్తూ కులం గురించి ఆరా తీయడంపై విసిగిపోయిన విద్యార్ధులతోపాటు పెరెంట్స్ ఆందోళనకు దిగారు.

కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా విద్యాశాఖ అధికారి రాముకు ఫిర్యాదు చేశారు. కులమతాల గురించి ఆరా తీసి లైంగికంగా వేదిస్తున్నాడని విద్యార్ధులతోపాటు పెరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానోపాద్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పిల్లలను బడికి పంపమని హెచ్చరించారు. వెంటనే స్పంధించిన విద్యాశాఖ అధికారి విచారణకు ఆదేశించారు.

హైస్కూల్ విద్యార్ధినిల పట్ల ప్రధానోపాద్యాయులు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారని విద్యార్ధులతోపాటు పేరెం...