భారతదేశం, ఫిబ్రవరి 15 -- Jagtial Crime : తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిళ్లు, కరెంటు మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. మెట్‌పల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టి...డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో, మెట్‌పల్లి సీఐ రంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ బృందం సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై అనిల్ తన సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీలలో ఇద్దరు అనుమానితులను అదుప...