Jagtial,telangana, ఏప్రిల్ 11 -- వరుస చోరీలతో పోలీసులకు సవాల్ గా మారిన అంతర్ జిల్లా గజ దొంగను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 286 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బక్కశెట్టి కొమరయ్య అలియాస్ రేగుల అజయ్ కుమార్ మంచిర్యాలలో నివాసం ఉంటున్నాడు. చోరీలే వృత్తిగా మార్చుకున్నాడు. చిన్నప్పటి నుంచే చోరీల అలవాటు ఉన్న అజయ్ గత జరివరి నుంచి మార్చి మాసాంతం వరకు ఒక జగిత్యాలలోనే 8 చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ గా మారాడు. వరుస చోరీలతో పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చెపట్టగా అజయ్ పట్టుపడ్డాడని ఎస్పీ తెలిపారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ఆదరణ సరిగా లేకపోవడంతోనే అజయ్ దొంగగా మారాడని స్పష్టం చేశారు

అజయ్ మొదటగా...