భారతదేశం, మార్చి 12 -- Jagtial Accident : జగిత్యాల జిల్లాలో అడవి పంది బైక్ ను ఢీ కొట్టడంతో రైతు ప్రాణాలు కోల్పోయాడు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సంగ శ్రీనివాస్ బైక్ ను అడవి పంది ఢీ కొట్టడంతో రైతు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. గత రాత్రి పంట పొలాల వద్దకు వెళ్లిన శ్రీనివాస్ బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా దారికి అడ్డంగా అడవి పంది పరుగెత్తుకుంటూ వచ్చి బైక్ ను బలంగా కొట్టింది.‌ దీంతో రోడ్డుపై పడ్డ శ్రీనివాస్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అడవి పంది బైక్ ను ఢీకొట్టడంతో రైతు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పోలీసులు చ...