భారతదేశం, మార్చి 21 -- Jagityala Crime: ప్రేమ పేరుతో వెంటపడ్డారు. ప్రేమించకుంటే పరువు తీస్తామని బెదిరించారు. ఇద్దరు యువకుల వేదింపులు తాళలేక మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాంభద్రునిపల్లిలో ఈ దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను ఆదే గ్రామానికి చెందిన బాస రాము రంగదామునిపల్లెకు చెందిన ప్రణయ్ వెంటపడ్డారు. ప్రేమించకుంటే సోషల్ మీడియాలో పరువు తీస్తామని బెదిరించారు.

వారి వెధింపులు బెదిరింపులపై పేరెంట్స్ చెప్పకుండా భయాందోళనకు గురైన బాలిక ఈనెల 15న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పేరెంట్స్ వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఏమైందని పేరెంట్స్ ఆరా తీస్తే ఇద్దరు ప్రేమ పేరుతో వేధిస్తూ బెదిరించార...