భారతదేశం, మార్చి 27 -- Jagityal Crime: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ ఆత్మహత్యకు పొరుగింట్లో ఉండే తోడికోడలి వరుసయ్యే మహిళే కారణమని భావించి ఆమెను హతమార్చాడు.

మహిళ ఆత్మహత్యకు పాల్పడిన గంటల వ్యవధిలోనే పక్కింటిలో నివాసం ఉంటున్న మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్‌లో మంగళవారం జరిగింది.

కమలాపూర్‌కు చెందిన పులి రేణుక (42) మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కల్లు గీత కార్మికుడైన రేణుక భర్త గంగన్న ఇంటికి వచ్చేసరికి రేణుక ఆత్మహత్యకు పాల్పడటం తెలిసి రగిలిపోయాడు. ఇంటి పక్కనే ఉండే పులి పద్మ అనే మహిళ కొద్ది సేపటికే హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.

పదునైన ఆయుధంతో పద్మ గొంతు కోసి హతమార్చారు. పద్మను రేణుక భర్త గంగన్నహత్య చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండు...